తెలంగాణ: ఒకే ఇంట్లో 19 మందికి కరోనా.. ఆ ప్రాంతమంతా రెడ్‌జోన్‌

By సుభాష్  Published on  13 Jun 2020 8:29 AM GMT
తెలంగాణ: ఒకే ఇంట్లో 19 మందికి కరోనా.. ఆ ప్రాంతమంతా రెడ్‌జోన్‌

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్ర స్థాయిలో చేరుకుంటోంది. రోజు వందకుపైగా కేసులు నమోదవుతూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి ఈ వైరస్‌ సోకడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణానికి చెందిన ఓ మహిళ (55) అనారోగ్యం బారినపడటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జూన్‌ 9వ తేదీని చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే మృతి చెందిన రోజే జహీరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా, మరోసటి రోజు పాజిటివ్‌ వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులను ఐసోలేషన్‌కు తరలించారు. అందులో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 19 మందికి పాజిటివ్‌ తేలినట్లు శుక్రవారం రిపోర్టు వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులున్నారు. వీరందరిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక అంత్యక్రియల్లో పాల్గొన్న 40 మంది వివరాలను సేకరిస్తున్నారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక మహిళ కరోనాతో మృతి చెందడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు అధిఆరులు. ఏ ప్రాంతంలో ఎలాంటి రాకపోకలు జరగడం లేదు. పూర్తిగా నిషేధం విధించారు.

Next Story