తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్‌తో సోమ‌వారం మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రం‌లో మృతుల సంఖ్య 23కి చేరింది. కాగా.. నేడు ఒక్క‌రోజే 14 కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన 14 కేసుల్లో 12 కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలో న‌మోదు కాగా.. మేడ్చ‌ల్‌, నిజామాబాద్‌లో ఒక్కో పాజిటివ్ కేసు న‌మోదైంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌రకు తెలంగాణ రాష్ట్రంలో 872 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల్లోంచి 186 మంది కోలుకోని డిశ్చారి కాగా.. 663 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో మే 7 వ‌ర‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.