ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా మరో 12 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ కేసులతో కలిసి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 8 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి.