తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగారా

By సుభాష్  Published on  30 Jan 2020 1:35 PM GMT
తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగారా

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది. పర్సన్‌ ఇన్‌చార్జీల పదవీ కాలం ముగియడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్దమైంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ, 15వ తేదీన పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెలువడనున్నట్లు పేర్కొంది.

ఈనెల 29న అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలపై పలు సూచనలు చేశారు. ఈ సహకార సంఘం ఎన్నికలు మొత్తం పదిహేను రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపట్టి, సహకార సంఘాలకు కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు

ఇక ఇటీవల నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 120 మున్సిపాలిటీలలో 112 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లను గెలుచుకుని ప్రతిపక్షాలకు గట్టి షాకిచ్చింది. ఇక ఇదే ఊపులో మిగిలిన ఎన్నికలు నిర్వహించి విజయఢంకా మోగించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Next Story
Share it