లంచం ఇవ్వలేదని వ్యక్తిపై అధికారిణి..

By రాణి  Published on  29 Jan 2020 6:39 PM IST
లంచం ఇవ్వలేదని వ్యక్తిపై అధికారిణి..

తనకు లంచం ఇవ్వలేదని రగిలిపోయిన సర్వేయర్ అధికారిణి సరిత అనే మహిళ రామిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసినట్లుగా కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ...రామిరెడ్డి సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఏరియాలో ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చేది సర్వేయర్ అధికారిణి సరిత. రామిరెడ్డి దరఖాస్తు కూడా ఆమె వద్దకు చేరింది. అయితే..ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలంటే తనకు రూ.8 లక్షలు లంచం ఇవ్వాల్సిందిగా సరిత డిమాండ్ చేసిందని రామిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. లంచం ఇవ్వడంలేని తాను..ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. తనపై ఫిర్యాదు చేశానని కోపం పెంచుకున్న సరిత ఏకంగా ఇంటికి వచ్చి తనపై చెప్పుతో దాడి చేసిందని ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రామిరెడ్డి మారేడుపల్లి పోలీసులకు అందజేశాడు. కాగా..సరితపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడమే కాకుండా..తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారంటూ..రామిరెడ్డి మీడియా ఎదుట ఆరోపించాడు. అధికార గర్వంతో లంచం అడిగి, తనపై ఎదురుదాడి చేసిన మహిళకు పోలీసులు పరోక్షంగా రక్షణ ఇస్తున్నారని, ఇక పోలీసులను సామాన్యులు ఎలా నమ్మేది అంటూ రామిరెడ్డి తన ఆవేదనను వెలిబుచ్చాడు.

Contonment Officer Attact A Person With Her Foot Wear 2

మూడేళ్లుగా ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వాలని కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయేసరికి చేసేది లేక రామిరెడ్డి కోర్టు నుంచి ఇంటి నిర్మాణానికి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. అక్కడికి వచ్చిన అధికారులు అనుమతులు లేకుండా ఇల్లు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. మరి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా రామిరెడ్డి వారిని మరో సారి కోరాడు. కేసు పెట్టాడన్న ఆక్రోశాన్ని ఆ మహిళా అధికారిణి అక్కడ చూపించింది. అతను ప్రశ్నించడమే ఆలస్యం తన కాలికున్న చెప్పుతో అతడిపై దాడి చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరితే..తిరిగి తనపైనే కేసు పెట్టారని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story