ఏపీ నుంచి 62 మందిని అక్రమంగా లక్నోకు తరలింపు..కంటైనర్‌ సీజ్‌

By సుభాష్  Published on  6 May 2020 6:43 AM GMT
ఏపీ నుంచి 62 మందిని అక్రమంగా లక్నోకు తరలింపు..కంటైనర్‌ సీజ్‌

గుంటూరు జిల్లా పొందుగల చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసుల కళ్లు గప్పి కంటైనర్‌లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి లక్నోకు అక్రమంగా తరలిస్తున్న 62 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి తరలిస్తుండటంపై జిల్లా ఎస్పీ విజయరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌ కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతున్నాయి. కరోనాను తరలిమికట్టాలంటే సామాజిక దూరం తప్పని సరిచేశారు. లాక్‌డౌన్‌ కూడా కఠినంగా అమలు చేస్తుందని ఏపీ ప్రభుత్వం.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కేసుల పాలవుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసులు ఎన్ని రకాలుగా వివరిస్తున్నా కొందరికి చెవికెక్కడం లేదు. నిబంధనలు ఉల్లంఘించవద్దని పదేపదే చెబుతున్నా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో ఎంతో మందిని ఇలా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కంటైనర్‌లోనే కాకుండా వాటర్‌ ట్యాంక్‌లలో, ఇలా రకరకాలుగా అక్రమంగా జనాలను తరలిస్తున్నారు.

Next Story
Share it