ఆ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విధుల్లో అల‌ర్ట్ గా ఉండ‌టం వ‌ల‌న‌.. ఓ ప్రయాణికుడి నిండు ప్రాణం నిలిచింది. 26వ తేదినాడు కోయంబత్తూర్ స్టేషన్ వద్ద, 56712 నంబ‌రు గ‌ల‌ కదిలే రైలు ఎక్క‌తూ.. ఒక ప్రయాణికుడు జారిపోయాడు. ఆన్ డ్యూటీ కానిస్టేబుల్ పి. వి. జయన్ ఆ వ్యక్తిని త్వరగా కోచ్ లోపలికి తోసాడు. ఒక్క క్ష‌ణంలో గాల్లో క‌లిసిపోయే ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడి ఆ కానిస్టేబుల్ రియ‌ల్ హీరో అయ్యాడు. కానిస్టేబుల్ ఆ ప్ర‌యాణికుడిని కాపాడే దృశ్యాలు రైల్వే మంత్రిత్వ శాఖ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. అలాగే.. క‌దులుతున్న రైలు ఎక్క‌డం ప్ర‌మాదం అని కూడా హెచ్చ‌రించింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.