ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మెరుపు ర్యాలీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 8:32 AM GMT
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మెరుపు ర్యాలీ

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మెరుపు ర్యాలీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ..చార్మినార్ లో రాజీవ్ సద్భావన యాత్ర మీటింగ్ ముగించుకున్నారు కాంగ్రెస్‌ నేతలు. అనంతరం ఆర్టీసి కార్మికుల కు సంఘీభావంగా..చార్మినార్ నుండి ఎంజిబీఎస్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో భాగాంగ కాంగ్రెస్‌ నేత విక్రమ్ గౌడ్ ఆర్టీసి కార్మికులకు మద్దతుగా షాప్ లు మూయించారు. ఈ ర్యాలీలో ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ..అంజన్ కమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, గ్రేటర్ నేతలు పాల్గొన్నారు. అయితే ..ర్యాలీ కి ఫర్మిషన్ లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు బహదూర్ పుర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Next Story
Share it