పది పరీక్షలు లేకుండానే ఇంటర్ లోకి..?
By రాణి Published on 28 March 2020 11:41 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరువలో ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదవ్వడంతో..హైదరాబాద్ లో 5 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా తెలంగాణలో మార్చి నెలాఖరు వరకూ ఉన్న లాక్ డౌన్ ను ఏప్రిల్ 15 వరకూ పొడిగించారు. అప్పటికి కూడా కరోనా తగ్గుముఖం పట్టకపోతే.. ఈ లాక్ డౌన్ మరికొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలా అలా మూడు నెలలపాటు ఇదే కొనసాగుతుందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే టెన్త్, ఇంటర్ పరీక్షల సంగతేంటి ? అసలు పరీక్షలు పెడతారా ? పెడితే..ఆ పరీక్షలకు వాల్యూయేషన్ జరుగుతుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read : అమ్మాయిల్లో ఎక్కువైన శృంగారపు ఆలోచనలు..!
కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గకపోతే రాష్ట్రాల్లో మూడు నెలల పాటు లాక్ డౌన్ ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెప్తున్న మాట. ఈ తరుణంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ గడువు మరింత పెరిగితే మాత్రం పది పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఇంటర్ కు ప్రమోట్ చేయాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 9వ తరగతిలో విద్యార్థులకొచ్చిన మార్కులు, 10వ తరగతిలో అటెండెన్స్ ను బట్టి 10 విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని కోరారు. అవసరం అనుకుంటే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ డిమాండ్ చేశారు.
Also Read : లాక్ డౌన్ ఎఫెక్ట్.. కండోమ్‌లకు యమ గిరాకీ!
ఇప్పటికే 6 నుంచి 9 వ తరగతుల వరకూ విద్యార్థులను పరీక్షలు లేకుండానే తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తూ ఏపీ ప్రకటించింది. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులను కూడా ఇదే క్రమంలో పాస్ చేయాలన్న డిమాండ్ తెరమీదికొచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.