పోలీస్ కమిషనర్‌కు వల్లభనేని వంశీ ఫిర్యాదు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 5:19 PM ISTవిజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ మేరకు తనపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అసలు దోషులను వెంటనే శిక్షించాలని పోలీస్ కమిషనర్ ను కోరారు. అయితే ఈ దుష్ప్రచారం టీడీపీకి చెందిన వెబ్ సైట్ల నుంచే జరుగుతుందని.. ప్రాథమిక సమాచారాన్ని వంశీ కమిషనర్‌కు అందజేశారు.
అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన చంద్రబాబు, లోకేష్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతే కాకుండా.. తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ బాగా తెలుసని వంశీ అన్నారు. దిష్టి బొమ్మను దగ్ధం చేసిన మాత్రాన తన ఇమేజ్ ఏమీ తగ్గదని వంశీ అన్నారు. అలాగే ఎన్నికల సమయాల్లో సూట్కేసులు కొట్టేసేవారు.. ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం అంతా బయట పెడుతానని వంశీ హెచ్చరించారు.