యాంకర్ ప్రదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు!
By సుభాష్ Published on 2 Feb 2020 5:02 AM GMTటీవీ యాంకర్, నటుడు ప్రదీప్‌పై ఓ యువ దర్శకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ నిబంధనలకు విరుద్దంగా ప్రదీప్ రెండు రోజుల కిందట జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రదీప్ ఓ సినిమాల్లో నటిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నిబంధనలకు విరుద్దంగా ఈ సినిమాల్లో ప్రదీప్ నటిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ప్రదీప్‌పై ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లాకు చెందిన శ్రీరామోజు సునిశిత్ మాట్లాడుతూ.. గత నెల 31న నేను టీవీ చూస్తుండగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో ప్రదీప్‌ను చూశాను. ఈ సినిమాల్లో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.. అని అన్నారు. గతంలో ప్రదీప్ ఒక అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు జైలుకు వెళ్లి వచ్చారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ నిబంధనలకు వ్యతిరేకంగా హీరోగా నటిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
అలాగే ప్రదీప్‌తో పాటు సినిమా డైరెక్టర్ కూడా నిబంధనలను అతిక్రమించారని చెప్పుకొచ్చారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని, ఈ షూటింగ్ జరుగకుండా నిలిపివేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ప్రదీప్‌పై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు.. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.
కాగా, బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజు ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. యాంకరింగ్‌లోనే కాకుండా సినిమాల్లో నటించేందుకు అడుగులు వేశాడు. ప్రస్తుతం ప్రదీప్ నటిస్తున్నసినిమా పేరు '30రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు మ్యూజికల్ పోస్టర్‌ను శనివారం హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.