విశాఖ ఘటన: బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత

By సుభాష్  Published on  11 May 2020 5:33 AM GMT
విశాఖ ఘటన: బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత

విశాఖ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన బాధితులకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున చెక్కులను అందజేసింది. ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌ మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం గ్రామంలో బాధిత కుటుంబాలకు మంత్రుల చేతుల మీదుగా ఈ చెక్కులను అందజేశారు. అలాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేస్తున్నారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా గ్రామాల్లో మాడిపోయిన చెట్లను తొలగించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.

కాగా, విశాఖలో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ కారణంగా చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌ మృతి చెందిన బాధిత కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాదు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ. 25 లక్షలు, రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స చేయించుకున్నవారికి లక్ష రూపాయల చొప్పున, ప్రాథమిక చికిత్స చేయించుకున్నవారికి రూ. 25వేలు, అలాగే మృతి చెందిన మూగజీవాల యజమానులకు రూ. 25వేల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it