రండి..రండి..అందాల సీతాకోకచిలుకలు చూసొద్దాం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 12:35 PM GMT
రండి..రండి..అందాల సీతాకోకచిలుకలు చూసొద్దాం..!

హైదరాబాద్ : నెహ్రు జులాజికల్ పార్కులోని ఓపెన్ బట్టర్ ఫ్లై పార్క్ సందర్శకులు వీక్షించేందుకు అందుబాటులోకి వచ్చింది. గత కొంత కాలంగా పునరుద్ధరణ పనుల పేరుతో మూసివేసిన ఓపెన్ బట్టర్ ఫ్లై పార్కు తిరిగి అక్టోబర్ 6న తెరిచారు. బట్టర్ ఫ్లై పార్కులో పలు కార్యక్రమాలు చేపట్టి, అన్ని హంగులతో పార్కును అటవీశాఖ అధికారులు అభివృద్ధి చేశారు. ఈ పార్క్ 1998 లో 5 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేశారు. కాగా పార్కులో కాలానుగుణంగా చూడగలిగే 36 రకాల సీతాకోకచిలుకలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పార్కులో వివిధ తేనె , లార్వా , హోస్ట్ ప్లాంట్లతో సీతాకోకచిలుకలను ఆకర్షించడానికి ఏర్పాటు చేశారు. ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేసే మొక్కలను పెంచుతున్నారు. కాగా బట్టర్ ఫ్లై పార్క్ తిరిగి ప్రారంభం కావడంతో వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ప్రపంచంలో దాదాపుగా 17వేల జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. అందులో తెలంగాణలో 155 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. సీతాకోకచిలుకలు వాతావరణ, కాలుష్య మార్పులకు చాలా సున్నితంగా గురవుతుంటాయి. అందుకే సీతాకోకచిలుకలను ఆరోగ్యకరమైన వాతావరణానికి బయో సూచికలుగా పిలుస్తుంటారు

Next Story
Share it