ఒక వైపు బాధగా ఉన్నా.. మరో వైపు సంతోషంగా ఉంది: సంతోష్ తల్లి
By సుభాష్ Published on 17 Jun 2020 5:46 AM GMTభారత్ - చైనా సరిహద్దుల్లోని లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు (37) వీరమరణం చెందారు. సంతోష్ మృతి చెందడంతోపై ఆయన తల్లి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. 'నా కుమారుడు చనిపోయినందుకు బాధగా ఉన్నా.. దేశంలో కోసం ప్రాణాలు అర్పించినందుకు సంతోషంగా ఉంది' అంటూ కన్నీరు ఆపుకొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్నగానొక్క కుమారుడు చనిపోవడం బాధగా ఉన్నా.. దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని చెప్పారు ఆ దంపతులు. ఇది చదవండి: తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు.. కల్నల్ సంతోష్ జీవిత విశేషాలు
చివరి సారిగా 'అమ్మా బాగున్నావా' అన్నాడు
తమకు మంగళవారం 2 గంటలకు మరణ వార్త తెలిసింది తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా, కరోనా వల్ల రావడం ఆలస్యమవుతుందనే చెప్పాడని, చివరిసారిగా నాతో ఆదివారం రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి 'అమ్మా బాగున్నావా' అని అడిగాడు. అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు.. నాతో ఎక్కువగా మాట్లాడేవాడు .. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అయితే చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని నాతో చెప్పాడు. జాగ్రత్తగా ఉండు నాన్న అని సంతోష్‌కు చెప్పినట్లు తల్లి గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చదవండి: భారత్ – చైనా సరిహద్దు.. గాల్వన్ లోయలో ఏం జరుగుతోంది..? ఘర్షణ ఎందుకు..?
మా కుమారుడు ఎంతో ప్రతిభగలవాడు
మా కుమారుడు సంతోష్ ఎంతో ప్రతిభ గలవాడు. 15 ఏళ్ల సర్వీసులోనే చాలా పదోన్నతులు, బంగారు పతకాలను సాధించాడు అంటూ తండ్రి చెప్పారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్మీలో పని చేయాలని కోరిక ఉండేది. కొన్ని కారణాల వల్ల నెరవేరలేదు. నా కుమారుడి రూపంలో నెరవేరింది. కాని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు.. అంటూ తండ్రి ఉపేందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది చదవండి: భారత్-చైనాల మధ్య ఘర్షణ.. సూర్యాపేట వాసి మృతి
ఎక్కడ పని చేసినా ప్రతిభ చూపేవాడు
నా కుమారుడు ఎక్కడ పని చేసినా ప్రతిభ చూపేవాడు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు. అలాగే విధులకు సంబంధించిన రహస్యాలు ఎంతో రహస్యంగా ఉంచేవాడు.. అంటూ తండ్రి గుర్తు చేశారు.