బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ​కాగ్నిజెంట్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు సిద్ధమైనట్లు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో 7వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుంచి నిష్క్రమించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులను తగ్గించుకుంటుంది. ఇది మరో 6వేల మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కంపెనీ తెలిపింది.

కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుంచి నిష్క్రమించడం వలన ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పోస్ట్‌ల నుంచి తొలగించనున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.