సీఎం జగన్ తో చిరు, చరణ్ భేటీ వాయిదా.. వెనకున్న అసలు నిజం ఇదే..!
By Medi Samrat
మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం 'సైరా నరసింహారెడ్డి'. గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సైరా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు గాను సీఎం జగన్ కి కృతజ్ఞతలు చెప్పేందుకు చిరంజీవి, రామ్ చరణ్ ఈ రోజు కలవనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.
దీంతో అందరూ... ఎప్పుడెప్పుడు జగన్ ని చిరు, చరణ్ కలిసారనే వార్త వస్తుందా..? అని అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎదురుచూశారు.. అయితే.. ఈరోజు జగన్ తో చిరు, చరణ్ ల భేటీ వాయిదా పడిందని తాజా వార్త బయటకు వచ్చింది. నిన్న ఈ రోజు కలవనున్నారని న్యూస్ వచ్చింది. ఈ రోజు ఏమో వాయిదా పడింది అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది..? దీని వెనకున్న అసలు కారణం ఏంటి..? అని ఆరా తీస్తే... అసలు నిజం తెలిసింది.
అది ఏంటంటే... సీఎం కార్యాలయం అసలు ఈ రోజు అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. నిన్న 'సైరా' యూనిట్ లో కొంత మంది అత్యుత్సాహం వలన అలా ప్రచారం జరిగిందని... ఈ నెల 14న చిరు, చరణ్ జగన్ ని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిసింది. సో... సీఎం జగన్ ని చిరు, చరణ్ ఈ నెల 14న కలవనున్నారట. అదీ.. సంగతి..!