ఇసుకపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 3:37 PM GMT
ఇసుకపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్

అమరావతి: ఇసుక లభ్యతను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అధికారులతో సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు నెలలకు మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామ సెక్రటేరియట్‌ల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు, రవాణా జరగాలన్నారు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు, చిన్న నదుల ఇసుక రీచ్‌లను గుర్తించాల్సిన బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రీచ్‌ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాను 20 కి.మీ పరిధి వరకే అనుమతించారు.

ఇసుక లభ్యతపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 55 రోజలు నుంచి గోదావరి, 71 రోజుల నుంచి కృష్ణానదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. తుంగ భద్ర పరీవాహక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 400–500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయని...ఫలితంగా ఇసుక లభ్యత ఉండే ప్రాంతాలనుంచి తవ్వకాలు చేయలేకపోతున్నామన్నారు. ఇసుక రీచ్‌ల దగ్గరకు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. 200కుపైగా రీచ్‌లు గుర్తిస్తే..69 చోట్ల మాత్రమే ఇసుక సేకరిస్తున్నట్లు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేశారు.

Next Story