దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్దుల వరకూ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి. కంటికి కనిపించని వైరస్‌ ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఇంటి వద్ద ఉన్న టీ స్టాల్‌ యజమానికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇక తాజాగా సీఎం నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో ముగ్గురిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రాంతాల్లో శానిటైజ్‌ చేస్తున్నారు. దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇలా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో కరోనా కేసులు మరింత పెరగడంతో లాక్‌డౌన్‌ను మే 21కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *