తూ.గో.జిల్లా: బోటు ప్రమాదం నుంచి బయటపడ్డవారిని ఆస్పత్రిలో పరామర్శించారు ఏపీ సీఎం జగన్. చికిత్స పొందుతున్నవారికి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామన్నారు.
ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి చెందిన మధులత సీఎంగా ఎదురుగానే కన్నీరుమున్నీరైంది. తన భర్త తనను కాపాడారని, కుమార్తె ను కాపాడుకోలేకపోయామంటూ కన్నీరు పెట్టుకుండి. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనను డాక్టర్లు బతికించారని సీఎంకు చెప్పింది.