గోదావరికి హారతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 7:07 AM GMT
గోదావరికి హారతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. కాళేశ్వరం పథకంతో మిడ్‌మానేరులోకి బ్యాక్‌ వాటర్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. మానేరు నది వద్ద గోదావరికి కేసీఆర్‌, వేదపండితులు పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం వేములవాడ చేరుకొని శ్రీరాజ రాజేశ్వరస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. కేసీఆర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌తో పాటు స్వామి వారిని కేటీఆర్‌ దంపతులు కూడా దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ వేములవాడ నుంచి తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌కు వెళ్లనున్నారు.

Next Story
Share it