హైదరాబాద్‌ కాలుష్యంపై కేసీఆర్‌ కీలక నిర్ణయం

By సుభాష్  Published on  26 Jan 2020 6:27 PM IST
హైదరాబాద్‌ కాలుష్యంపై కేసీఆర్‌ కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌ తోపాటు ఇతర నగరాలు, పట్టణాలలో కాలుష్యం అధికంగా పెరిగిపోతోందని, అలా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో అధికంగా చెట్లు పెంచి, దట్టమైన అడవిలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమిలో చెట్లు పెంచాలని అధికారులకు సూచించారు. ఇందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ నిధుల్లో పదిశాతం వాడుకోవాలని సూచించారు.

చుట్టుపక్కల దట్టంగా అడవులుగా మార్చడం వల్ల హైదరాబాద్‌ లోఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరగకుండా ఉంటుందన్నారు. అలాగే వివిధ నగరాల్లో కూడా అధికంగా చెట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకు ఒక నర్సరీని ఏర్పాటు చేసేలా ప్లాన్‌ ప్లాన్‌ చేయాలని ఆదేశించారు.

Next Story