గోదావరికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

By అంజి  Published on  13 Feb 2020 9:47 AM GMT
గోదావరికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి నుంచి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నేపల్లి పంప్‌హౌస్‌లను హెలికాఫ్టర్‌ నుంచే వీక్షించారు. గోదావరి పుష్కరఘాట్‌ వద్ద త్రివేణి సంగమం వద్ద కేసీఆర్‌ పూజలు చేశారు. గోదావరి-ప్రాణహిత నది నీళ్లను తలమీద చల్లుకున్నారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్‌.. చీర, సారె సమర్పించారు.

CM KCR kaleshwaram tour

కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ అశీర్వదించిన అర్చకులు.. తీర్థప్రసాదాలను అందజేశారు. కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమాలకర్‌, కొప్పుల ఈశ్వర్‌, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Next Story