సీపీఎం మధును పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 7 Nov 2019 7:15 PM IST

తాడేపల్లి: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు మాట్లాడారు.



Next Story