రైతులకు సీఎం జగన్ మరో బంపర్ ఆఫర్.!
By Medi Samrat Published on 14 Oct 2019 5:54 PM ISTవైఎస్సార్ రైతు భరోసాపై సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచుతూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌యాదవ్, ఎంవీఎస్ నాగిరెడ్డి, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా.. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును రెండు, మూడు విడతలుగా ఇచ్చిననా అభ్యంతరం లేదన్నారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది.
రేపే రైతు భరోసా.. రూ. 5,510 కోట్లు విడుదల
రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు.