హైదరాబాద్ : ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేకే. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తన అభిప్రాయం మాత్రమే చెబుతున్నానని తెలిపారు. సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చిందన్నారు. ప్రెస్ రిలీజ్‌కు ముందుగాని..తరువాతని గాని సీఎం కేసీఆర్‌తో మాట్లాడలేదన్నారు. సీఎంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నానని కాని..ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తన స్టేట్‌మెంట్ తో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయన్నారు. తాను చర్చలు జరుపుతానని అనలేదని..మంచి జరుగుతుందని అనుకుంటే…సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధమన్నారు. ఇది పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య అన్నారు. తనతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం అన్నారు. తాను సోషలిస్ట్ నని రాజ్యం వైపు ఉండనని, కార్మికుల వైపు ఉంటానని కేకే ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు, కాని..విలీనమైతే మంచిదేనన్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మనసులో ఏముందో తనకు తెలియదన్నారు. తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేదన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.