ఆర్టీసీ రూట్లు ప్రైవేటీకరించడానికి వీల్లేదు: సీఎల్పీ నేత భట్టి
By Newsmeter.Network Published on 28 Nov 2019 1:02 PM GMTతెలంగాణాలో ఆర్టీసీ రూట్లు ప్రైవేటీకరించడానికి వీల్లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అంతే కాకుండా.. కార్మికుల ఉద్యోగాలు తీసీవేసే అధికారం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి కార్మికులకు విధుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎంను కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. సీఎం ఫర్మిషన్ ఇస్తే.. ఆర్టీసీ పక్షాన, ఆర్టీసీ ఆస్తుల పక్షాన తాను సీఎంతో మాట్లాడటాని సిద్ధంగా ఉన్నట్లు భట్టి తెలిపారు. క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం నిర్ణయం తీసుకుంటారని.. కార్మికులకు విధుల్లోకి తీసుకుంటారని.. తామంతా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అలా కాకుండా క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే.. కార్మికుల పక్షాన కాంగ్రెస్ నిలబడతుందన్నారు.
జేఏసి పిలుపునిస్తే ఈనెల 30న అన్నీ డిపోల ముందు ధర్నాలకు సంఘీభావం తెలుపాతమన్నారు. డిసెంబర్ 5 న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ మేరకు తామంతా పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.