మియా మాల్కొవా.. ఆర్జీవీ మ‌ళ్లీ జతకట్టారుగా.. అప్పుడు GST.. మ‌రీ ఇప్పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 1:15 PM GMT
మియా మాల్కొవా.. ఆర్జీవీ మ‌ళ్లీ జతకట్టారుగా.. అప్పుడు GST.. మ‌రీ ఇప్పుడు

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. లాక్‌డౌన్‌లోనూ నిత్యం ఏదో పోస్టుతో వార్త‌ల్లో ఉంటున్నాడు. ఆ మ‌ధ్య 'జీఎస్టీ' (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అంటూ సంచలనం సృష్టించాడు. జీఎస్టీ సినిమా ఎంత వివాదాస్పదమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మల్కోవా నటించిన ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న ప్రకారం దాన్ని విడుదల చేసి చూపించాడు ఆర్జీవీ. అయితే అదే మియా మాల్కోవాతో క‌లిసి మ‌రో సినిమా రూపొదిస్తున్నాడు ఆర్‌జీవీ. ఈ చిత్రం పేరు 'క్లైమాక్స్‌'.

తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం రామ్‌గోపాల్ వ‌ర్మ విడుద‌ల చేశారు. మియా త‌న విశ్వ‌రూపాన్ని చూపింది. ఎడారిలో సెక్సీగా క‌నిపిస్తూ యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ఈ టీజ‌ర్‌ను చూస్తుంటే.. హార్ర‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఎక్క‌డా కూడా శృంగార ప్రియుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌లేదు. మే 18న ఉద‌యం 9.30ని.లకి ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున‌ట్లు టీజ‌ర్ చివ‌ర్లో చూపించారు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి రామ్‌గోపాల్ వ‌ర్మ ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడ‌ట‌. విడుద‌ల చేసిన కొద్ది క్ష‌ణాల్లోనే ఈ చిత్ర టీజ‌ర్ నెటింట్లో వైర‌ల్‌గా మారింది.Next Story
Share it