అయోధ్య తీర్పు వెలువ‌డింది. ద‌శాబ్దాలుగా వివాద‌స్ప‌దంగా ఉన్న రామ‌జ‌న్మ‌భూమి వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది. అయితే ఈ కేసులో రోజువారీ విచారణలతో తీరిక లేకుండా గడిపిన సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఆయన నేతృత్వంలోని బెంచ్ శనివారం రాత్రి డిన్నర్‌కు వెళ్లనున్నట్లు స‌మాచారం.

ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో బెంచ్‌లోని నలుగురు సభ్యులకు డిన్నర్ ఇవ్వాలని గొగోయ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇన్ని రోజుల విచారణ తర్వాత కాస్తంత బ్రేక్ అవసరమని భావించిన ఆయన ఈ డిన్నర్‌కు ప్లాన్ చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే.. అయోధ్య కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం తుది తీర్పు వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని బెంచ్ సూచించింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

One comment on "‘రంజన్ గొగోయ్’ బ్రేక్ కోసం వెళుతున్నార‌ట‌.. ఇంత‌కీ ఎక్క‌డికీ?"

Comments are closed.