ఏపీ: ఈనెల 20 నుంచి సిటీ బస్సులు
By సుభాష్ Published on 12 Sep 2020 2:46 AM GMTకరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రంగాలతో పాటు బస్సు సర్వీసులు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీనులను ఈనెల 20వ తేదీ నుంచి నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. 20వ తేదీ నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల రాత పరీక్షలు ఉండటంతో దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో ఈ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది ఏపీ ఆర్టీసీ. అందుకు తగినట్లుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ మేరకు ఏపీ ఆర్టీసీ సిద్ధం చేసిన ప్రణాళికలను వైద్య ఆరోగ్య ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి అనుమతి కోసం పంపింది. ఏపీ సీఎస్ నీలం సాహ్నితో జవహార్‌రెడ్డి నిర్ణయం తీసుకుని అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.