చ్యవన్ ప్రాష్‌ను విపరీతంగా కొనేస్తున్నారట‌.. ఎందుకంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2020 11:32 AM GMT
చ్యవన్ ప్రాష్‌ను విపరీతంగా కొనేస్తున్నారట‌.. ఎందుకంటే..

చ్యవన్ ప్రాష్ 700 కోట్ల రూపాయల మార్కెట్.. ఏకంగా 30-40 శాతం డిమాండ్ పెరిగిందట.. అది కూడా గత వారం రోజుల్లోనే అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

చ్యవన్ ప్రాష్ ను ఎక్కువగా చలికాలంలో వినియోగిస్తూ ఉంటారట.. కానీ మొదటి సారి మార్చి-ఏప్రిల్ నెలల్లో ఇంత స్థాయిలో వాడడాన్ని చూస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగానే మార్కెట్ లో వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. పెరిగిన డిమాండ్ కు తగ్గట్టుగానే సప్లై విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నారట.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చ్యవన్ ప్రష్ ను ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఉపయోగిస్తారని అంటారు. ముఖ్యంగా ఆయుర్వేద మూలికలు, ఉసిరి లతో రూపొందిస్తారు కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని నమ్మే వాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచనలను చేసిన కారణంగా చ్యవన్ ప్రష్ కు డిమాండ్ పెరిగింది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవాళ్లపై కోవిద్-19 ప్రభావం అతి తక్కువగా చూపుతుంది అని అంటున్నారు.. అందుకే ప్రజలంతా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే పనిలో పడ్డారు.

డాబర్ ఇండియా మార్కెటింగ్ హెడ్(హెల్త్ కేర్) ముకేష్ మిశ్రా మాట్లాడుతూ "డాబర్ చ్యవన్ ప్రష్ గురించి విచారించే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా ఎక్కువగా పెరిగిందని అన్నారు. వినియోగదారులు తమను తాము కాపాడుకోడానికి ఇటువంటి పదార్థాల వినియోగాన్ని ఎక్కువ చేశారని.. లాక్ డౌన్ సమయమైనా తాము డిమాండ్ కు తగ్గ సప్లై చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నామని అన్నారు.

చ్యవన్ ప్రష్ ప్రాడక్ట్స్ విషయంలో డాబర్ మార్కెట్ లోనే లీడర్ గా ఉంది. దాదాపు 60 శాతం షేర్ డాబర్ దే..! ఇమామీ, బైద్యనాథ్, పతంజలి మార్కెట్ లో పోటీదారుల్లా ఉన్నారు.

పతంజలి కంపెనీ కూడా మార్చి 6 నుండి ఏప్రిల్ 6 సమయంలో 400 శాతం వృద్ధి రేటును సాధించిందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. చ్యవన్ ప్రష్ వేరియెంట్స్ విషయంలో తాము పలు రకాలను మార్కెట్ లో వదిలామని అన్నారు. అలాగే షుగర్ ఫ్రీ కూడా అందుబాటు లోకి తెచ్చామని అన్నారు. కొన్ని కొన్ని సార్లు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో సరఫరా గొలుసు అన్నది తెగిపోతుందని అలాంటప్పుడు తాము మార్కెట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టవలసి వచ్చిందని అన్నారు. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థాయికి రావడంతో తాము రోగ నిరోధక శక్తిని పెంపొందించే పదార్థాలను వినియోగదారుల కోసం మార్కెట్ లోకి తీసుకుని వస్తున్నామని అన్నారు.

మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను చూసి 'తులసి' అనే మరో ప్రోడక్ట్ ను లాంచ్ చేయాలని డాబర్ సంస్థ భావిస్తోంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే కరోనా నుండి కాపాడుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. మార్కెట్ లో దొరికే వస్తువుల్లో ఏవి బెస్ట్ గా పని చేస్తాయో వాటి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆయుర్వేద ప్రాడక్టులను ఎక్కువగా వినియోగించడం కూడా మొదలైంది. అందుకే మార్కెట్ లో ప్రస్తుతం చ్యవన్ ప్రష్ ప్రోడక్ట్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.

Next Story
Share it