'రాజుగారి గది- 3' సెన్షేషనల్ హిట్ కాబోతోంది

By Medi Samrat  Published on  16 Oct 2019 12:49 PM GMT
రాజుగారి గది- 3 సెన్షేషనల్ హిట్ కాబోతోంది

రాజుగారి గది, రాజుగారి గది- 2 చిత్రాలతో ఘనవిజయం సాధించిన ఓంకార్ ఇప్పుడు ఆ సీరీస్ కి కొనసాగింపుగా ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'రాజుగారి గది- 3'. అశ్విన్ బాబు హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. హార్రర్ కామిడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రీ- రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కెమెరామెన్ చోటా కె. నాయుడు, హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ అవికా గోర్, దర్శకుడు ఓంకార్, డిస్ట్రిబ్యూటర్ శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Raju Gari Gadi 3 3

ప్రముఖ కెమెరామెన్ చోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం బయపెడుతూనే నవ్విస్తుంది. హార్రర్ కామిడి ఎంటర్ టైనర్ చిత్రం ఇది. సెన్సేషనల్ హిట్ కాబోతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఈ సినిమా తర్వాత ఇలాంటి చిత్రాలు ఓంకార్ నుండి మరో 9 వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నటీనటుల్లో బద్ధకం పెరిగింది అని ఓ న్యూస్ పేపర్లో చదివాను. అది తప్పు. దానికి నటీ, నటులకు అసలు సంబంధం లేదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మనసు పెట్టి ఈ సినిమా చేశారు. డెఫినెట్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

Raju Gari Gadi 3 2

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 5 సినిమాలు చేశాను. ఈ సినిమాతో నా కల నెరవేరబోతుంది. చోటా గారి లాంటి బెస్ట్ కెమెరామెన్ తో వర్క్ చేయడం నా అదృష్టం. అలాగే సీనియర్ నటులతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. మూవీ చాలా బాగా వచ్చింది. జూన్ 21న స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంత త్వరగా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం కాస్ట్ అండ్ కృ. ఈ సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

Raju Gari Gadi 3

హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. ఇది నా ఓన్ ప్రొడక్ట్. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది. చాలా నెర్వస్ గా వున్నాను. నాకు వెరీ స్పెషల్ ఫిల్మ్. అందరూ ఇన్వాల్వ్ అయి వర్క్ చేశారు. చోటా గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. అన్నారు.

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. రెండుగంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్ ఇది. అనుక్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తికావడానికి కారణం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. అలాగే నేను యాంకర్ గా ఉన్నప్పటినుండి నాకు సపోర్ట్ గా నా తమ్ముళ్లు నిలిచారు. నా తమ్ముడు అశ్విన్ ని హీరోని చెయ్యాలని ఉండేది. అది ఈ సినిమాతో నా బాధ్యత తీరింది. కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మాకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. చోటా గారు ఇప్పటివరకు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఆయనకి నా థ్యాంక్స్. అవికా ఈ సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోతుంది. అంత బాగా పెర్ఫార్మన్స్ చేసింది. నవంబర్18న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

Next Story
Share it