ఉప రాష్ట్రపతి వెంకయ్య ఇంట్లో ‘సైరా నరసింహరెడ్డి’

ఢిల్లీ: ‘సైరా నరసింహ రెడ్డి’ విజయాన్ని చిరంజీవి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంజాయ్ చేస్తున్నారు. 14వతేదీన ఏపీ సీఎం జగన్‌తో లంచ్ చేసిన చిరంజీవి..ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ..ఉప రాష్ట్రపతి వెంకయ్య కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమా చూడనున్నారు. ఈ సినిమాకు కేంద్రంలోని పలువురు మంత్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.