చిరు - కొర‌టాల మూవీ లేటెస్ట్ అప్ డేట్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 1:47 PM GMT
చిరు - కొర‌టాల మూవీ లేటెస్ట్ అప్ డేట్..?

మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బ్లాక్ బ‌స్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌నున్న సినిమాను ఇటీవ‌ల‌ ప్రారంభించారు. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్‌గా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే... ఈ సినిమాకి సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ - అతుల్ పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. సాధారణంగా కొరటాల సినిమా అంటే... మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ అందిస్తారు. ఏమైందో ఏమో కానీ... చిరు 'అజయ్ - అతుల్' పేర్లను సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో చరణ్ కనబరిచిన ఆసక్తే ఎక్కువని అంటున్నారు. కొరటాల కూడా అందుకు అంగీకరించి వాళ్లతో చర్చలు జరుపుతున్నారట. ఈ భారీ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఇక చిరు స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనేది ఇంకా ఖ‌రారు కాలేదు కానీ... త్రిష పేరు వినిపిస్తోంది మ‌రీ.. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు అని స‌మాచారం.

Next Story
Share it