చిరు బీజేపీలో చేరబోతున్నారా? ఆయన ఏమంటున్నారు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sept 2019 11:42 AM IST
చిరు బీజేపీలో చేరబోతున్నారా? ఆయన ఏమంటున్నారు..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీ స్ధాపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో చిరు ఉన్నప్పటికీ యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గోవడం లేదు. దీంతో చిరు పార్టీ మారనున్నారని.. బీజేపీలో చేరుతారని గత కొన్నాళ్లుగా ఇటు టాలీవుడ్, అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా..ఏపీలో బీజేపీ సీఎం అభ్యర్ధి చిరు అనే టాక్‌ కూడా బాగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే... మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో న‌టించిన భారీ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందిన‌ ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రముఖ దిన పత్రికకుఇంట‌ర్ వ్యూ ఇచ్చారు.

ఈ ఇంట‌ర్ వ్యూలో చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. మీరు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజ‌మేనా..? అని అడిగితే.. తాను బీజేపీ చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తేల్చిచెప్పేశారు. ఈ విధంగా ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై చిరు క్లారిటీ ఇవ్వడంతో మోగాభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story