చిరంజీవి Vs రాజశేఖర్
By Newsmeter.Network Published on 2 Jan 2020 8:00 AM GMT
హైదరాబాద్: 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. చిరంజీవి ప్రసంగానికి ప్రసంగానికి రాజశేఖర్ పదే పదే అడ్డుపడ్డారు. నిజాలు చెప్పి మీటింగ్‌కు రావాలని, చెప్పేది ఒకటి.. బయట జరిగేది మరోకటి అంటూ రాజశేఖర్ మాట్లాడారు. తన యాక్సిడెంట్ కూడా 'మా'లో విభేదాల వల్లే జరిగిందని రాజశేఖర్ అన్నారు. ఇండస్ట్రీలో నిప్పురాజుకుంటోందన్న రాజేశేఖర్ వేదికపై పెద్దలందరికి కాళ్లు మొక్కి వెళ్లిపోయాడు.ఏ దీంతో మా డైరీ ఆవిష్కరణలో రసాభాస జరిగింది.
రాజశేఖర్ మైకు లాగి మాట్లడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చిరంజీవి అన్నారు. డిసిప్లెన్ లేకుండా ఇలా చేయడం మంచిది కాదన్నారు. డిస్టర్బ్ చేసేందుకు ప్లాన్డ్ వచ్చారన్నారు. మంచి ఉంటే మైక్‌లో చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని చిరంజీవి పేర్కొన్నారు. అగ్రెసివ్‌గా మాట్లాడటం ఏం మర్యాదం అంటూ చిరంజీవి మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే కమిటీకి చెప్పాలన్నారు.
తాను సీఎం జగన్‌ని కలిసినప్పుడు సినిమా పరిశ్రమను డెవలప్ చెద్దామని చెప్పాడని చిరంజీవి అన్నారు. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని నాకు సీఎం కేసీఆర్ మాటిచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మనకు సహాయం చేయడంలో ముందుంది, మనం కేసీఆర్ ఇచ్చిన హామీని వినియోగించుకుందామని, ఏపీ సీఎం జగన్ నుంచి కూడా మనకు సహకారం ఉందని చిరంజీవి తెలిపారు. ప్రతి కళాకారుడు ఆలోచించాలని, 'మా' డైరీలో కళాకారులకు అవసరమయ్యే సమాచారం ఉంటుందని చిరంజీవి అన్నారు. భవిష్యత్త ప్రణాళికతో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనేక సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లామన్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ హయత్ హోటల్‌లో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, కృష్ణంరాజు, రాజశేఖర్, పరుచూరి బ్రదర్స్, సుబ్బరామిరెడ్డి, మోహన్‌బాబు, జీవిత, జయసుధ, మురళీమోహన్ హాజరయ్యారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇక్కడ మనస్పర్ధలు వున్న మాట వాస్తవం. చిరంజీవి, కృష్ణంరాజు బాగా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఎలా కార్యక్రమాలు చేస్తున్నారో అలా ఇక్కడ కూడా జరగాలి. ఒక తల్లి బిడ్డలుగా ఉన్నాము. ఒకసారి టివిలో ఇద్దరు కమెడియన్స్ తిట్టుకుంటే నేను పిలిచి వార్నింగ్ ఇచ్చాను. ఎవరైనా సినిమా వాల్లగురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పాను. నరేష్ నువ్వు ఈ విషయాల గురించి ఇంకేమి మాట్లాడవద్దు.. సవాళ్లు ప్రతి సవాళ్లు వద్దు. ఇది ఎవ్వరూ సొత్తు కాదు అందరిదీ అన్నారు.