ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణుమాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్ లో అనారోగ్యం కార‌ణంగా త‌ది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.  ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి వేణుమాధ‌వ్ అకాల మ‌ర‌ణం పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతి తెలిపారు.
చిరంజీవి స్పందిస్తూ… వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడు. అటుపై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య న‌టుడుగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్ర‌లు త‌న కోస‌మే పుట్టాయ‌న్నంత‌గా న‌టించేవాడు. ఆ పాత్ర‌కే వ‌న్నే తీసుకువ‌చ్చాడు. వ‌య‌సులో చిన్న‌వాడు.  సినీ ప‌రిశ్ర‌మ‌లో బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌ని అనుకునేవాడిని కానీ.. దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.