వీరత్వం చూపించేందుకు సరైన సమయం ఇది కాదు
By తోట వంశీ కుమార్ Published on 16 July 2020 7:51 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం ఆడుతోంది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మాస్కులపై అవగాహాన కల్పిస్తున్నారు. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం ఒక్కటేమార్గమంటూ ఓ రెండు వీడియోను పోస్టు చేశారు.
ఆడవారు అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం ప్రస్తుతం అవసరం లేదని, మగవారు వీరత్వం చూపించే సమయం ఇది కాదు అని మనమంతా మాస్క్ ధరించడం తప్పని సరి అని తెలియజేశారు. హీరోయిన్ ఈషా రెబ్బా, యంగ్ హీరో కార్తీకుయతో కలిసి మెగాస్టార్ ఈ వీడియోలను చేశారు.
చిరునవ్వు ముఖానికి అందం కానీ.. ఈ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్కు ధరించడం తప్పని సరి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
'మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం' అని పేర్కొంటూ, “మాస్క్ తప్పనిసరిగా ధరించండి. వీలైనన్ని సార్లు చేతులు శుభ్రంగా కడుకోండి . మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి” అని మెగాస్టార్ సందేశమిచ్చారు. ఈ ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన ఈషా కు కార్తికేయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు .