ప్రియమైన కోడలికి కృతజ్ఞతలు : చిరంజీవి
By రాణి Published on 6 April 2020 1:25 PM IST
మెగా వారింటి కోడలు కొణిదెల ఉపాసనకు మామ మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులకు చేయూతనందించేందుకు స్థాపించిన సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)కి తనవంతు సహాయాన్ని అందించేందుకు ఉపాసన ముందుకొచ్చారు. సీసీసీకి చెందిన సినీ కార్మికులకు అన్ని అపోలో మెడికల్ స్టోర్స్ లో ఉచితంగా మందులిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు తన కోడలికి కృతజ్ఞతలు చెప్తూ..నువ్వు నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తివి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ కారణంగా సినీ, సీరియళ్ల షూటింగులు ఆగిపోవడంతో..చాలా మంది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వారిని ఆదుకునేందుకే సీసీసీని ప్రారంభించారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్రహీరోలు సహా దర్శకులు, నిర్మాతలంతా సీసీసీకి విరాళాలందించారు.
Also Read :లాక్ డౌన్ ఎత్తివేతతో ఉద్యోగాలు ఊడనున్నాయా ?
Next Story