అత్యంత సంతృప్తిని ఇచ్చిన సమయమిదే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 1:52 PM IST
అత్యంత సంతృప్తిని ఇచ్చిన సమయమిదే

తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన సమయమిదే అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ట్విట్టర్‌ లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఒకరి జీవితాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరొకటి లేదన్నారు. తాను గతంలో రక్తదానం చేసిన ఫోటోలతో ఈ వీడియోను రూపొందించారు.

తన జీవితంలో తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సమయమది అంటూ ఆ వీడియోకి కాప్షన్ ఇచ్చారు. రక్తదానం చేసి వేరొకరి జీవితాన్ని కాపాడడానికి మించిన ఆనందం ఏముంటుందని ప్రశ్నించారు. 'రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఎంతో మంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని.. ఇది విని చాలా సంతోషిస్తున్నానని, ఇందుకుగానూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతానని, రక్తదానం చేసే శక్తిని ఆయన ఇచ్చాడని, ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా చిరంజీవి తన సేవలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.



Next Story