కరోనా యోధులపై పూలవ‌ర్షం కురిపించ‌డం అభినంద‌నీయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2020 11:00 AM GMT
కరోనా యోధులపై పూలవ‌ర్షం కురిపించ‌డం అభినంద‌నీయం

క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న వైద్యులు, న‌ర్సులు, పారిశుద్ధ్య‌కార్మికులు, ఆరోగ్య‌శాఖ సిబ్బంది, పోలీసుల‌కు వినూత్నంగా స‌త్క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా త్రివిధ ద‌ళాలు దిల్లీ, హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, చెన్నై, బెంగ‌ళూరుతో పాటు దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఉన్న కోవిడ్ ఆస్ప‌త్రుల‌పై ఆదివారం హెలీకాప్ట‌ర్ల‌తో పూల‌వ‌ర్షం కురిపించాయి.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురింపించ‌డం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క‌రోనా క‌ట్ట‌డిపై ముందు వ‌రుస‌గా నిల‌బ‌డి పోరాటం చేస్తున్న క‌రోనా యోధుల‌కు సంఘీభావంగా వారిపై గ‌గ‌న‌త‌లం నుంచి పూల‌వ‌ర్షం కురిపించ‌డం అభినంద‌నీయం అన్నారు. ‘సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం. మీ ఇద్దరికి మేమంతా రుణపడి ఉన్నాం. జై హింద్‌’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.



Next Story