షాజహాన్ పూర్(యూపీ) : బీజేపీ నేత స్వామి చిన్మయానంద(73)ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయ విద్య అభ్యసిస్తున్న ఓ 23 ఏళ్ల యువతిని సంవత్సరం పాటు రేప్‌ చేసిన కేసులో స్వామిని అరెస్ట్ చేశారు . లా కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఆశపెట్టి తనను మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఏడాది పాటు లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Image result for Chinmayanand
బాధితురాలు ఇదే విషయాన్ని కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా చెప్పింది. తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్‌ కూడా చేయించుకున్నాడని ఆమె  ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం షాజహాన్‌పూర్‌ లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్‌ అధికారులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.