టిక్ టాక్ పోయే.. దాని డూప్ లు చాలానే వచ్చే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 1:08 PM IST
టిక్ టాక్ పోయే.. దాని డూప్ లు చాలానే వచ్చే..!

టిక్ టాక్.. ఎంతో మందికి ఆనందాన్ని నింపింది. మరెంతో మందికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మరెందరో జీవితాల్లో బాధను కూడా నింపింది. ఒకప్పుడు భారత్ లో ఎంతో మంది ఈ యాప్ ను తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నారు. చైనా ప్రొడక్ట్స్ ను బ్యాన్ చేయాలి అన్నప్పుడు చాలా మంది టిక్ టాక్ ను అన్ ఇన్స్టాల్ చేసేశారు. ఇటీవలే భారత్ చైనా యాప్స్ ను చాలా వరకూ బ్యాన్ చేసేసింది. వాటిలో టిక్ టాక్ కూడా ఉంది.

ఇక టిక్ టాక్ కు ఉన్న క్రేజ్, మార్కెట్ ను క్యాష్ చేసుకోడానికి ఎన్నో యాప్స్ పోటీ పడుతూ ఉన్నాయి. షార్ట్ వీడియో ఫార్మాట్ లో భారతీయులను ఆకట్టుకోడానికి ఈ యాప్స్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి. అచ్చం టిక్ టాక్ ను పోలిన మూడు చైనీస్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో టాప్-10లో చేరాయి.

స్నాక్ వీడియో, లైకీ లైట్, జిల్లి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో టాప్-10 లోని ఛార్ట్ లోకి చేరుకున్నాయి. అది కూడా నెల రోజుల వ్యవధిలోనే టాప్ 10 లోకి చేరుకున్నాయి. షేర్ చాట్ సంస్థకు చెందిన షార్ట్ వీడియో యాప్ Moj నంబర్ వన్ పొజిషన్ లో ఉండగా.. Snack యాప్ రెండు స్థానంలో ఉంది. ఈ యాప్ కు చైనాకు చెందిన టెన్సెంట్ సంస్థ అండగా ఉంది. లైకీ యాప్ ను బ్యాన్ చేయగా.. ఆ యాప్ కు చెందిన లైట్ వెర్షన్ అయిదవ స్థానంలో ఉంది. ఇక Mi సంస్థకు చెందిన జిల్లి యాప్ తొమ్మిదో స్థానంలో ఉంది.

భారత్ కు చెందిన స్టార్టప్ సంస్థలు మిత్రోన్, చింగారి, ట్రెల్, బోలో ఇండియా లు కూడా టిక్ టాక్ స్పాట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ను కూడా లాంఛ్ చేశారు.

గత నెలలో చైనాకు చెందిన 59 యాప్స్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. బైట్ డాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్ ను కూడా బ్యాన్ చేశారు. భారత్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేసే సమయానికి 200 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉండగా.. 660 మిలియన్ల డౌన్ లోడ్స్ జరిగాయి. టిక్ టాక్ యాప్ ప్రపంచ వ్యాప్త డౌన్ లోడ్లలో 30 శాతం భారత్ లోనే డౌన్లోడ్ అయినట్లు తెలుస్తోంది. లైకీ యాప్ కూడా భారత్ లో బ్యాన్ చేశారు. కానీ లైట్ వెర్షన్ ఇంకా అందుబాటులో ఉంది. సింగపూర్ కు చెందిన బీగో టెక్నాలజీ లైకీ యాప్ ను రూపొందించారు. చైనీస్ ఇంటర్నెట్ సంస్థ Joyy Inc ఓనర్ గా ఉంది.

Next Story