కరోనా మా దేశంలో పుట్టలేదు: చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

By సుభాష్  Published on  10 Oct 2020 6:52 AM GMT
కరోనా మా దేశంలో పుట్టలేదు: చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కరోనా పేరు వింటేనే ప్రపంచం మొత్త గడగడలాడిపోతుంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని ప్రభావం అంతా కాదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనాతో లక్షలాది మంది మృత్యువాత పడగా, కరోనా కట్టడికి దేశాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇక కరోనా పుట్టినిల్లు వూహాన్‌ అంటూ వస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ బూటకమని చైనా వాదిస్తోంది. నిజానానికి గత ఏడాది చివరి నాటికే కరోనా వైరస్‌ ఎన్నో దేశాల్లో బయటపడిందని చైనా ప్రకటించింది. ఆ కేసులను మొట్టమొదట గుర్తించి యావత్‌ ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన తొలిదేశం తమదేనని ఢంకా బజాయించింది. కోవిడ్‌ విషయంలో వస్తున్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ మీడియాతో మాట్లాడారు. వైరస్‌ మూలాలపై విచారణ చేపట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిపుణుల బృందంలోని సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అనుమతి కోసం పంపింది. దీనిని చైనా ఆమోదిస్తే ..నిపుణుల బృందం చైనాకు వెళ్లి స్వతంత్ర విచారణ చేపట్టేందుకుమార్గం సుగమం అవుతుంది.

అయితే తమ దేశంలో బయటపడ్డ వైరస్‌ ఆనవాళ్ల గురించి ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందే తాము రికార్డు చేసి పెట్టామని అన్నారు. అందుకే కరోనా చైనాలో పట్టిందన్న ప్రచారం మొదలైందని చెప్పుకొచ్చారు. కరోనా ఎక్కడ మొదలైందనే విషయాన్ని తేల్చడానికి సమగ్రమైన దర్యాప్తు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వొ) తెలిపిన విషయం తెలిసిందే.

అయితే జపాన్‌ వేదికగా భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి ఏర్పడింది. అది చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు చైనాపై నమ్మకం అనేది లేకుండా పోతోంది. ఇప్పుడు కరోనా విషయంలో ప్రపంచ దేశాలన్ని కూడా చైనాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాకుండా అనేక సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చైనా కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది చైనా.

Next Story