చైనా ఓపెన్ లో సింధూకు ఘోర పరాభవం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 11:10 AM GMT
చైనా ఓపెన్ లో సింధూకు ఘోర పరాభవం..!

చైనా: సరిగ్గా.. రెండు వారాల క్రితం ప్రపంచ బ్యాట్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు చైనా ఓపెన్‌ లో చుక్కెదురయింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో పోర్న్‌పావే చూచూవోంగ్‌(థాయిలాండ్‌) చేతిలో పరాజయం చెందింది. దాంతో మరో టైటిల్‌ను సాధించాలనుకున్న సింధు ఆశలు నెరవేరలేదు. తొలి గేమ్ ను సింపుల్ గా గెలిచిన సింధు.. ఆపై రెండు వరుస గేమ్‌ల్లో విఫలమైంది. రెండో గేమ్‌లో పుంజుకున్న చూచూవోంగ్‌ రెండు గేమ్ ల్లోనూ సింధుపై పైచేయి సాధించి మ్యాచ్ విన్నర్ గా నిలిచింది.

Next Story
Share it