చైనా ప్రకటించిన కరోనా బాధితుల సంఖ్య సరికాదు..

By Newsmeter.Network  Published on  3 April 2020 2:48 PM IST
చైనా ప్రకటించిన కరోనా బాధితుల సంఖ్య సరికాదు..

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అని ఏమీ లేకుండా.. అన్ని దేశాల్లోనూ వ్యాప్తిచెంది అక్కడి ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్‌ ఆ దేశాన్ని అతలాకుతలం చేసి ఇప్పుడు మిగిలిన దేశాలపై తన ప్రతాపాన్ని చూపుతుంది. అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, భారత్‌, పాకిస్థాన్‌ ఇలా అన్ని దేశాలు ఈ వైరస్‌ భారిన పడి అతలాకుతలమవుతున్నాయి. రోజురోజుకు ఆయా దేశాల్లో వైరస్‌ సోకిన వారి సంఖ్య, వైరస్‌ సోకి మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.

Also Read :రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య

కానీ చైనా మాత్రం కరోనా బాధితుల సంఖ్యను తప్పుగా చెబుతుందని పలు ఆదేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా బీజింగ్‌ నుంచి వెలువడే కరోనా బాధితుల సంఖ్యను నమ్మరాదని సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హెలీ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశం ప్రకటించిన కరోనా బాధితుల సంఖ్య సరికాదని చాలా స్పస్టంగా తెలుస్తోందని చెప్పారు. ఈమేరకు ఆమె ఓ ట్వీట్‌ చేశారు. 150 కోట్ల జనాభా గల దేశంలో 82 వేల మందికే వైరస్‌ సోకిందని, 33వేల మందే మరణించారని చైనా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇవి సరైన లెక్కలు కావనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నాయని నిక్కీహేలీ అన్నారు. అక్కడే పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రపంచ దేశాలకు సాయపడకుండా చైనా తన ఖ్యాతిని కాపాడుకొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఆమె దుయ్యబట్టారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా చెబుతున్న లెక్కలపై అనుమానం వ్యక్తం చేశారు. చైనా చెప్పే సంఖ్య కన్నా మరింత ఎక్కువ ఉండొచ్చని ట్రంప్‌ అభిప్రాయ పడ్డారు.-

Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

మరోవైపు ఇదే విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహారు రాబర్ట్‌ బిబ్రియన్‌ మాట్లాడుతూ.. చైనా చెప్పే లెక్కలను నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అక్కడ నమోదయ్యే కేసుల సంఖ్య తెలుసుకునే స్థితిలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాలు చైనా ప్రకటిస్తున్న కరోనా బాధితుల లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో ప్రధానంగా అమెరికా ముందు వరుసలో ఉంది. అవకాశం దొరి కినప్పుడల్లా చైనాపై విమర్శలదాడిని కొనసాగిస్తూనే ఉంది.

Next Story