చైనాలో 'కోవిద్‌-19' మృత్యుకేళి.. ఒక్కరోజే 242 మంది ప్రాణాలు..

By అంజి  Published on  13 Feb 2020 9:19 AM IST
చైనాలో కోవిద్‌-19 మృత్యుకేళి.. ఒక్కరోజే 242 మంది ప్రాణాలు..

హైదరాబాద్‌: చైనాలో కోవిద్‌‌-19 వైరస్‌ విజృంభిస్తోంది. మృతుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. హుబాయ్‌ ప్రావిన్స్‌లో ఒక్క బుధవారం నాడే 242 మంది తమ ప్రాణాలను విడిచారు. కోవిద్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎక్కువ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి. కాగా కొత్తగా మరో 15 వేల కోవిద్‌-19 వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. చైనా వ్యాప్తంగా సుమారు 60 వేల కోవిడ్‌ కేసులు నమోదు అయ్యినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ మృతుల సంఖ్య 1310కి చేరుకుంది. కోవిద్‌ వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,441కిగా ఉంది. రోనా వ్యాప్తించింది వూహాన్ నుంచే అయినా…ఇప్పుడు దీని ప్రభావం హుబెయ్ ప్రావిన్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం ఈ ప్రాంతంలోనే 242 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కోవిద్‌ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు కలత చెందుతున్నారు. మరో 34 వేల మంది చికిత్స పొందుతున్నట్లు చైనా వార్త సంస్థలు తెలిపాయి. ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే దాదాపు 80 శాతం కోవిద్‌-19 వైరస్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్‌-2019(covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది. కోవిడ్‌ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019. నిజానికి కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు.

ఇదిలా ఉంటే సుమారు 2 వేల మంది ప్రయాణికులు ఉన్న ఓ భారీ నౌకను కాంబోడియా తీరం వద్ద నిలిపివేశారు. నౌకలో కోవిద్‌ వైరస్‌ సోకినవారు ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఆ నౌకను తమ తీరాల్లో నిలిపేందుకు జపాన్‌, తైవామ్‌, గువామ్‌, పిలిప్పీన్స్‌, థాయిలాండ్‌ దేశాలు నిరాకరించాయి.

10 రోజుల క్రితం జపాన్ యొకొహామా పోర్టుకు చేరిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో 3,711 మంది ప్రయాణికుల్లో 174 మంది కోవిడ్ 19 బాధితులున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. 174 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అలాగే నౌకలో ఉన్న భారతీయులతో అక్కడి..భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది.

Next Story