చైనాకు కొత్త తలనొప్పి.. వారి వివరాలు అందజేస్తే రూ. 54వేల నజరానా.!
By సుభాష్ Published on 16 April 2020 3:53 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ మృత్యువును వెంటాడుతోంది. అయితే చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ వైరస్.. మరో కొత్త తలనొప్పి మొదలైంది. వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి మూలంగా మళ్లీ కరోనా కేసులు మొదలవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పూర్తిస్థాయిలో కరోనా లేకుండా పోయిందని అనుకున్న ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశంలోకి ప్రవేశించిన వారి వివరాలు అందించిన వారికి నజరానా అందజేస్తామని ప్రకటిస్తోంది.
దేశంలోని ఈశాన్య ప్రాంతమైన హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం కొత్తగా 80 కేసుల వరకు నమోదయ్యాయి. మళ్లీ కేసుల నమోదుతో అధికారులను ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందు సరిహద్దుల వద్ద భారీ నిఘా పెట్టింది చైనా ప్రభుత్వం. దేశంలో చొరబడిన వారి వివరాలు అందజేస్తే ఒక్కొక్కరికి రూ.54వేల చొప్పున అందజేస్తామని ప్రకటిస్తోంది.