కేసీఆర్ తాతకు విరాళం..కేటీఆర్ అంకుల్ కు ట్వీట్
By రాణి Published on 21 April 2020 1:49 PM ISTకరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కార్మికులకు ఆహారం, నిత్యావసరాలు అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రముఖ సినీ నటులు, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నేతలు విరాళాలిస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు సైతం పేదల కష్టాలను చూసి చలించారు. ఆ చిన్ని మనసులు కూడా వారికి సహాయం చేయాలని సంకల్పించాయి. అందుకే వారు తమ కిడ్డీబ్యాంక్ ల్లో దాచుకున్న నగదు మొత్తాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ద్వారా కేసీఆర్ రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఈ మేరకు కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా..ఆ ట్వీట్ కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
Also Read : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు అస్వస్థత..?
@KTRTRS డియర్ కెటిఆర్ అంకుల్ మేము(రిషికేష్, రిషిత, అక్షయ్, ఆశిష్) కిడ్డీ బ్యాంక్ ద్వారా దాచుకున్న 30000 రూపాయలను ఈరోజు మా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అంకుల్ ద్వారా కెసిఆర్ తాతకు పంపించాము. వీటిని కరోనా వల్ల పనులు కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం ఉపయోగించగలరు. అంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పేదల కోసం ఆ పసిమనసులు చేసిన సహాయానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చిన్న వయసులోనే వారి సంకల్పాన్ని చూసి మురిసిపోయారు.