కోలార్ : వినాయకుని నిమజ్జనం కోసం నీటి గుంట వద్దకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆంధ్రా కర్నాటక సరిహద్దుల్లోని కోలార్  జిల్లాలోని మదరగట్ట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

ముగ్గురు పొరపాటున గుంటలో పడి మునిగిపోతుండగా, మిగితా ముగ్గురు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ మునిగిపోయారు. వీరి మరణం వారి తల్లిదండ్రులు, బంధువులనే కాదు ఊరిజనాన్ని కూడా కలచివేసింది. మృతి చెందిన చిన్నారులను..తేజస్వి, రక్షిత్, రోహిత్, వైష్ణవి, ధనుష్, వీణ గా  గుర్తించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.