బిబిసి ఇంటర్వ్యూకు అడ్డు పడ్డ చిన్నారి.. అమ్మా యాంకర్ పేరేంటి అని అడుగుతూ..!

By సుభాష్  Published on  2 July 2020 7:23 AM GMT
బిబిసి ఇంటర్వ్యూకు అడ్డు పడ్డ చిన్నారి.. అమ్మా యాంకర్ పేరేంటి అని అడుగుతూ..!

పెద్దవాళ్లు ఎవరైనా లైవ్ ఇస్తుంటే చిన్న పిల్లలు అడ్డుపడుతూ ఉండడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. తాజాగా బిబిసి ఇంటర్వ్యూలో ఓ చిన్నారి తన తల్లి డిస్కషన్ కు అడ్డుపడింది. అంతేకాదు అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటూ కూడా అడిగింది.

బిబిసి ఇంటర్వ్యూలో డాక్టర్ క్లేర్ వెన్హామ్ యాంకర్ క్రిస్టియన్ ఫ్రెజర్ తో మాట్లాడుతూ ఉండగా క్లేర్ వెన్హామ్ కుమార్తె మధ్యలో వచ్చింది. ప్రస్తుతం అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు.. అనలిస్టులు కూడా ఇంటి దగ్గర ఉండే వీడియో కాల్స్ ద్వారా టీవీ ఛానల్స్ డిబేట్ లలో పాల్గొంటూ ఉండగా.. క్లేర్ వెన్హామ్ కూడా అలాగే తన ఒపీనియన్ ను చెబుతున్న సమయంలో ఆమె కుమార్తె స్కార్లెట్ అడ్డుపడింది. యాంకర్ క్రిస్టియన్ ఫ్రెజర్ కూడా చిన్నారి స్కార్లెట్ లో మాట్లాడాలని అనుకోగా.. నువ్వెవరు.. నీ పేరేంటి అంటూ స్కార్లెట్ అతడితో మాట కలిపింది.

డాక్టర్ క్లేర్ వెన్హామ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు చెందిన గ్లోబల్ హెల్త్ పాలసీ ఎక్స్పర్ట్. ఆమె బిబిసి యాంకర్ క్రిస్టియన్ ఫ్రెజర్ తో కరోనా వైరస్ లాక్ డౌన్ ల గురించి మాట్లాడుతూ ఉండగా బ్యాగ్రౌండ్ లో స్కార్లెట్ కనిపించింది. తన తల్లి డిస్కషన్ లో పాల్గొంటూ ఉండగా.. వెనకాల పెయింటింగ్ ను సర్దడంలో బిజీగా కనిపించింది స్కార్లెట్. క్లేర్ వెన్హామ్ ను మీ కుమార్తె పేరు ఏమిటి అని అడిగింది. స్కార్లెట్ అని చెప్పగా యాంకర్ ఆ పేరుని పలికాడు. పెయింటింగ్ ను కింద షెల్ఫ్ లో పెట్టడం మంచిది అని సలహా ఇచ్చాడు. ఇంతలో ఈ మాటలు విన్న స్కార్లెట్ తన తల్లి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని అనుకుంది. 'అతని పేరు ఏంటి..? అమ్మా అతడి పేరు ఏమిటి ' అంటూ ఎంతో క్యూట్ గా అడగడంతో యాంకర్ కూడా రిప్లై ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో అప్లోడ్ చేశాక మిలియన్ వ్యూస్ అందుకుంది ఈ వీడియో.Next Story
Share it